చిరునామాకు నిఖార్సైన పాస్‌కోడ్: ఇప్పుడు డిజిపిన్!
భారత పోస్టల్ శాఖ ఇప్పుడు చిరునామాల్ని మరింత ఖచ్చితంగా గుర్తించే నూతన సాంకేతికతను తీసుకొచ్చింది. డిజిపిన్ (DIGIPIN) పేరుతో ఈ డిజిటల్ చిరునామా వ్యవస్థను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఐఐటీ హైదరాబాద్ మరియు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. సాధారణంగా మనకు తెలిసిన ఆరంకెలల పిన్ కోడ్ 1972 నుంచి వాడుకలో ఉంది. కానీ ఇది ఓ ప్రాంతాన్ని మాత్రమే సూచిస్తుంది. డిజిపిన్ మాత్రం 4x4 మీటర్ల చతురస్ర ప్రాంతాన్ని గుర్తిస్తుంది. అంటే ప్రతి ఇంటికీ, ప్రతి స్థలానికీ ప్రత్యేకంగా ఓ డిజిపిన్ ఉంటుంది. ఈ డిజిపిన్ వ్యవస్థ కేవలం పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ, తీరప్రాంతాల్లోనూ పనిచేస్తుంది. ఇది జీపీఎస్ ఆధారంగా పని చేస్తూ, వ్యక్తిగత సమాచారం ఏదీ నిల్వచేయదు. దీంతో ఇది ప్రైవసీ పరంగా సురక్షితం.ఇలా తెలుసుకోవచ్చు మీ డిజిపిన్
-
https://www.indiapost.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘Know Your Digipin’ అనే పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
-
మీ ఫోన్‌లో GPS ఆన్ చేయండి లేదా లాటిట్యూడ్/లాంగిట్యూడ్ కోఆర్డినేట్లు ఎంటర్ చేయండి.
-
వెంటనే మీకు 10 అక్షరాల డిజిపిన్ కనిపిస్తుంది.
ఇది త్వరలో లాజిస్టిక్స్, డిజిటల్ గవర్నెన్స్, ఎమర్జెన్సీ సర్వీసులు, తదితర వ్యవస్థల్లో కీలకంగా మారనుంది. అయితే, ఇది పాత పిన్‌కోడ్‌కు బదులు కాదు. రెండూ కలిపి పనిచేస్తూ, చిరునామా వ్యవస్థను మరింత కచ్చితంగా చేస్తాయి.
https://itsdd.in/india-post-digipin-launched-for-precise-addressing-how-it-works/
Comments
Post a Comment